- Advertisement -

జగన్ తో హీరో నితిన్ గొడవ పడ్డాడా..?!

- Advertisement -

మొదటేమో నితిన్ పూరీకి ఏకంగా కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడు. ‘హార్ట్ ఎటాక్’ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చినప్పుడే వీరిద్దరూ మరో సినిమాకు ఒప్పందం చేసుకొన్నారు. ఆ సినిమాకు నితిన్ స్వయంగా నిర్మాతగా మారాలని అనుకొన్నాడు.

ఇంకా ఆ సినిమా మొదలు కావడమే ఖాయం అనుకొంటున్న సమయంలో ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. చివరకు నితిన్- పూరి జగన్ కాంబినేషన్ లోని సినిమా ఆగిపోయింది! 

నితిన్ స్థానంలో నాగబాబు తనయుడు హీరోగా తెరపైకి వచ్చాడు.  ఈ విషయం ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. నితనే ఈ విషయాన్ని ప్రకటించాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఈ సినిమ  చేయలేకపోతున్నానని.. మళ్లీ పూరీతో సినిమాను చేస్తానని నితిన్ చెప్పుకొచ్చాడు. అది అవకాశం ఉంటేనే అని తేల్చేశాడు!

మరి పూరీతో సినిమా ఆగిపోయిన విషయాన్ని ప్రకటించిన నితిన్ అదెందుకు ఆగిపోయిందో చెప్పకపోవడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. హిట్ పెయిర్ గా పేరుపొందిన వీళ్లు.. ఫ్యామిలీల పరంగా కూడా బాగా దగ్గరై.. అడ్వాన్స్ లు ఇచ్చుకొనేంత వరకూ వచ్చి మరీ సినిమాను ఆపేశారంటే.. ఏదో బలమైన రీజనే ఉండాలి. బహుశా వీళ్లిద్దరి మధ్య ఏవైనా గొడవలు వచ్చాయేమో అనే వారూ కనిపిస్తున్నారు. మరి అసలు సంగతి ఏమిటో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -