మాస్ట్రో ఓటీటీలో? పాపం నితిన్​ ..!

- Advertisement -

నితిన్​ హీరోగా హిందీలో హిట్​ అయిన ‘అంధాదున్’ సినిమాను తెలుగులోకి రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నితిన్​ తండ్రి సుధాకర్​రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం పలువురిని సంప్రదించి చివరకు తమన్నాను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కరోనా ఫస్ట్​వేవ్​ తర్వాత నితిన్ నటించిన .. చెక్​, రంగ్​దే చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో హిందీలో విజయం సాధించిన అంధాదున్​ను రీమేక్​ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నితిన్​ అంధుడిగా కనిపించబోతున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అంధాదున్​ను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ​

- Advertisement -

ఈ సినిమాను రూ. 32 కోట్లకు విక్రయించాలని నిర్మాత సుధాకర్​రెడ్డి భావిస్తున్నారట. ఈ మేరకు ఓ ప్రముఖ ఓటీటీతో ఆయన బేరం కుదర్చుకున్నారట. అయితే సదరు సంస్థ రూ. 28 కోట్లు చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై బేర సారాలు సాగుతున్నాయట. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేస్తే అంతకంటే మొత్తం అందదని భావిస్తున్న సుధాకర్ రెడ్డి ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నారు అని సమాచారం. సొంత బ్యానర్లో చేసిన సినిమా కూడా ఓటీటీ బాట పడుతుండడంతో నితిన్ నిరాశ తప్పడం లేదు.

Also Read

ఐకాన్ మూవీలో బన్నీ రోల్ పై షాకింగ్ న్యూస్…!

పవన్ మూవీలో పెంచల్ దాస్ పాట..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -