Thursday, April 25, 2024
- Advertisement -

పహిల్వాన్ మూవీ రివ్యూ

- Advertisement -

మూవీ: పహిల్వాన్
విడుదల తేదీ: సెప్టెంబర్ 12 2019
తారాగణం: సుదీప్, సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్, కబీర్ సింగ్, సుశాంత్ సింగ్
దర్శకుడు: కృష్ణ
నిర్మాత: స్వప్న కృష్ణ
సంగీత దర్శకుడు: అర్జున్ జన్య
ఛాయాగ్రాహకుడు: గణేష్ ఆచార్య
నృత్య దర్శకుడు: రాజు సుందరం
ఎడిటర్: రూబెన్

కిచ్చా సుదీప్ కెరీర్ లో నే ఒక పెద్ద సినిమా గా పహిల్వాన్ ని ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ఈ రోజే వివిధ భాషల్లో విడుదల అయింది. అయితే ఇక ఈ సినిమా సమీక్ష వివరాలకి వస్తే,..

కథ:
కృష్ణ (సుదీప్) ఒక అనాథ. కృష్ణ గురువు సర్కార్ (సునీల్ శెట్టి).సర్కార్ కృష్ణ ని ఒక మంచి కుస్తీ వీరుడి గా తయారు చేస్తాడు. కృష్ణ అందరినీ అధిగమించి నేషనల్ చాంపియన్షిప్ తీసుకొని వస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ కృష్ణ మాత్రం గురువు నిర్దేశించిన గోల్ ని గాలికి వదిలేసి ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఈ విషయం లో సర్కార్ నిరుత్సాహపడతారు. అక్కడ నుంచి కృష్ణ ని దూరం పెడతాడు. అసలు కృష్ణ తన గోల్ ని ఎందుకు మర్చిపోయాడు? మళ్ళీ సర్కార్ కృష్ణ ని చేరదీసాడా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.

నటీనటుల పనితీరు:
కిచ్చా సుదీప్ మేకోవర్ ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా లో తన బాడీ ని సుదీప్ మలుచుకున్న తీరు అభినందనీయం. పోరాటాల విషయం లో పెర్ఫార్మెన్స్ విషయం లో సుదీప్ తన బెస్ట్ ఇవ్వడమే కాకుండా మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ప్రేక్షకుల ని ఆకట్టుకున్నాడు. అభిమానులందరికీ సుదీప్ నటన ఒక ఫీస్ట్ లాగ ఉంటుంది. సునీల్ శెట్టి తన పాత్రలో ఒదిగిపోయారు. ఎంతో నైపుణ్యం తో ఒక మెచ్యూర్ పెర్ఫర్మన్స్ ఇచ్చారు. కోచ్ గా అతని నటన బాగుంది. వారి ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి. ఇక పోతే ఆకాంక్షను సింగ్ పాత్ర కూడా వివిధ షేడ్స్ తో అద్భుతం గా వచ్చింది. తను కూడా తన నటన తో అందరినీ ఎంతగానో అలరించింది అని చెప్పుకోవచ్చు. నెగటివ్ పాత్ర లో మెరిసిన కబీర్ సింగ్ బాగున్నాడు. తన నటన అందరినీ ఎంతగానో అలరించింది. సుశాంత్ సింగ్ కూడా ఈ సినిమా లో బాగున్నాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమా కి మరో ప్రధాన ఆకర్షణ నేపథ్య సంగీతం. ఈ సినిమా లో నిర్మాణ విలువలు చాలా అద్భుతం గా ఉన్నాయి. విజువల్స్ కూడా అందం గా తీశారు. తెలుగు డబ్బింగ్ అద్భుతంగా లేకపోయినా బాగానే ఉంది అనిపిస్తుంది. సంభాషణలు బాగున్నాయి. ఈ సినిమా లో స్క్రీన్ ప్లే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ మీద ఇంకా శ్రద్ద పెట్టవలసి ఉంటుంది. మొదటి భాగం తో పోల్చుకుంటే రెండో భాగం కొంచెం ఫాస్ట్ గా అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడు తనకి ఉన్నంతలో బాగానే కష్టపడ్డాడు. సుదీప్ ని మాత్రం అద్భుతం గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. కథ ని ఆసక్తికరం గా చెప్పే విధానం లో మాత్రం చాలా డ్రా బాక్స్ ఉన్నాయి.

విశ్లేషణ:
ఈ సినిమా లో ఇంటర్వెల్ పాయింట్ బాగుంది. ఎమోషన్స్ అన్నీ ఎంతగానో చక్కగా కుదిరాయి. బాక్సింగ్ సెటప్ ని బాగా చేశారు. ఈ సినిమా కి మైనస్ పాయింట్స్ విషయం గురించి ప్రస్తావన చేస్తే, ఈ సినిమా లో కథ ఉన్నట్టు అస్సలు అనిపించదు. సుల్తాన్, భద్రాచల మరి కొన్ని చిత్రాలు చూసినట్టే అనిపిస్తుంది. సుదీప్ మాస్ ఇమేజ్ ని ఎలివేట్ చేసే విధం గా ఒక గొప్ప చిత్రం గా ఈ సినిమా ఉండదు. ఇంకా ఈ సినిమా నిడివి కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా కొత్త ఎపిసోడ్స్ ఈ సినిమా లో ఇబ్బంది మరియు బోరింగ్ గా అనిపిస్తాయి. ఎమోషన్స్ కి కూడా ప్రేక్షకులు అంతలా ఆకర్షితులు కాలేకపోయారు. కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్నాయి కానీ వాటిని సరిగా వాడుకోలేకపోయారు దర్శక నిర్మాతలు. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. మొత్తం గా చెప్పాలంటే ఇదొక రొటీన్ స్పోర్ట్స్ డ్రామా. సుదీప్ స్క్రీన్ ప్రెజన్స్,ఇమేజ్ మీద మాత్రమే ఆడదగ్గ చిత్రం. కొన్ని బోరింగ్ సీన్ల వలన సినిమా చిరాకు పెడుతుంది. నిడివి కూడా తగ్గిస్తే సినిమా ఇంకా బాగుందే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా ఒక రొటీన్ స్పోర్ట్స్ డ్రామా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -