కరోనాను తన్నితరిమేశానంటున్న పూజా హెగ్డే.. వైరల్ కామెంట్స్!

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. అలాగే ఎందరో సెలబ్రిటీల ప్రాణాలను బలిగొంటోంది నేపథ్యంలో సినిమా షూటింగ్స్ నిలిపి వేయగా రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం, ఆచార్య, నారప్ప వంటి సినిమాల విడుదల తేదీలను మార్చుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీలు ఎదుర్కొంటున్న సమస్య కరోనా. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు కరోనా మహమ్మారి జయించారు. అలాగే కన్నడ బ్యూటీ పూజా హెగ్డే కరోనా బారిన పడ్డానని, తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని , ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో సురక్షితంగా ఉన్నానని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.

- Advertisement -

Also read:రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

తాజాగా టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని తన ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. స్టుపిడ్ కరోనా బట్ మీద తన్నేశాను.. నెగెటివ్ అని రిజల్ట్ వచ్చింది..మీరు ఇచ్చిన సహకారం, ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది.. ఈ అద్భుతం జరగడానికి కారణం మీరే.. మీకు ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను.మీరు నాపై చూపించిన ప్రేమ, పంచిన ప్రేమకు థ్యాంక్స్. నేను మొత్తానికి కోలుకున్నానని చెప్పుకొచ్చారు.

Also read:మందుబాబుల్లో అది చూస్తే ఉందంటున్న యాంకర్ రవి!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -