టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహాన్ని చేసుకొన్నారు. లాక్‌డౌన్ కారణంగా అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య అనిత మరణాంతరం ఒంటరిగా ఉంటున్న దిల్ రాజుకు తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి.
మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన పెళ్లికి 20 మందిలోపే హాజరయ్యారని తెలిసింది. పెళ్లిలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నట్టు తెలిసింది. పరిసర ప్రాంతాలను సానిటైజ్ చేసి కరోనావైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించారని సన్నిహితులు చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్షలను విధిగా పాటించాల్సి వచ్చిందని సన్నిహితులు చెప్పారు. దిల్ రాజు సోదరులు, అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అయ్యారు. అయితే దిల్ రాజును పెళ్లి చేసుకొన్న అమ్మాయి పేరు ఏమిటంటే వైఘారెడ్డి.
అయితే ఇద్దరి జాతకాలను బట్టి వధువు పేరును మార్చారని తెలిసింది. ఆమె అసలు పేరు తేజస్విని. ఆమె గతంలో ఎయిర్ హోస్టెస్‌గా చేశారని సమచారం. వైఘారెడ్డి వయసు 33 సంవత్సరాలు అని తెలిసింది. ఆమె దిల్ రాజు కుటుంబంలోని అతి దగ్గరి ఫ్యామిలీకి చెందిన వారుగా చెప్పారు. గతంలో కుటుంబ పరమైన రిలేషన్స్ కూడా ఇరు ఫ్యామిలీ మధ్య ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దిల్ రాజు దంపతుల ఫోటోలు మీడియాలో రిలీజ్ కాగా.. అవి ట్రెండ్ అవుతున్నాయి.
