Sunday, May 12, 2024
- Advertisement -

‘రాజా ది గ్రేట్’ మూవీ రివ్యూ

- Advertisement -

చాలా గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ చేసిన సినిమా ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో.. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. సాయికార్తీక్ అదిరిపోయే పాటలను అందించాడు. రవితేజ సరసన మెహరిన్ హీరోయిన్‌గా నటించింది. కమర్షియల్ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని దీపావళి పండగ సంధర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ప్రకాష్ (ప్రకాష్ రాజ్) పోలీస్ ఆఫీసర్.. అతనికి డ్యూటీ, కూతురు లక్కీ(మెహరీన్).. ఇవే ప్రపంచం. అయితే ఎప్పుడు కుతురు పుట్టిన రోజును.. సొంత ఊర్లో జరపడం అతనికి ఇష్టం. అలా ఒకసారి ఆమెకి నీకు ఒక సర్ ప్రైజ్ వచ్చే ఏడాది ఇస్తా అని చెప్తాడు. ఆ తర్వాత ప్రకాష్ కు వేరే జిల్లాకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడ క్రిమినల్ దేవరాజ్ (వివన్) ఆగడాలను అడ్డుకునే ప్రయత్నంలో దేవరాజ్ తమ్ముడిని చంపేస్తాడు. అందుకు ప్రకాష్ కూతురు లక్కీ కూడా సహాయం చేస్తోంది. తమ్ముడు చావుకు కారణమైన వారిని చంపాలని ప్రకాష్ ను దేవరాజ్ చంపేస్తాడు. లక్కీ మాత్రం తప్పించుకుంటుంది. ఇక రాజా (రవితేజ) పుట్టుకతోనే అంధుడు. తన కొడుకుకు కళ్లు లేకున్నా అన్ని విషయాల్లో ముందు ఉండాలని చదువుతోపాటు.. అన్నింటిలో శిక్షణ ఇప్పిస్తోంది తల్లి అనంత లక్ష్మీ (రాధిక). తన కొడుకు ఎప్పటికైన గొప్పవాడు అవుతాడనే నమ్మకంతో రాజా ది గ్రేట్ అంటూ పిలుచుకుంటుంది. రాజాను పోలీస్ ఆఫీసర్ ను చేయాలనుకున్న అనంత లక్ష్మీ, ఐజీ సంపత్ లక్కీ్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన సీక్రెట్ మిషన్ లో రాజాకు అవకాశం ఇప్పిస్తుంది. మరి కళ్లు లేని రాజా.. లక్కీని ఎలా కాపాడాడు.. తర్వాత వారి మధ్య ఏం జరిగిందనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ హీరో రవితేజ. అంధుడి పాత్రలో ఆయన నటన అద్భుతం. రవితేజ యాక్టింగ్, ఎనర్జీ బాగా ప్లస్ అయ్యింది. ఇక యాక్షన్, డాన్సులు, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రధానంగా రవితేజ చెప్పిన డైలాగ్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక రవితేజకు తల్లిగా రాధిక చాలా బాగా చేసింది. రవితేజ, రాధికల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ఇక రవితేజ సరసన హీరోయిన్ మెహరీన్ బాగానే చేసింది. నటన పరంగా పర్వాలేదు అనిపించుకున్నా.. గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. రవితేజ, మెహరీన్ ల మధ్య వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డి మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. మెహరీన్ తండ్రి పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ బాగా చేసాడు. రాజేంద్రప్రసాద్ తన క్యారెక్టర్ తో అలరించాడు. ఇక అలీ, బిత్తిరి సత్తి, సత్యం రాజేష్ తదితరులు వారి వారి పాత్రల మేరకు బాగా చేశారు. సినిమా మొత్తం ఎంటర్ టైన్మెంట్ గా సాగింది. రాజా ది గ్రేట్ అనే టైటిల్ కు రవితేజ ఎనర్జీ బాగా సెట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ తో ఆకట్టుకోగా… ఇంటర్వెల్ బ్యాంగ్ లో చిన్న ఎమోషన్ మూడ్ ను క్రియేట్ చేసి బాగా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా బాగా చూపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకులను అలరించే విధంగా బాగానే డిజైన్ చేసాడు. ఇక సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు విజువల్స్ పరంగా అదిరిపోయాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ మోహన కృష్ణ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. కొన్ని కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఒక అంధుడు విలన్లను అంత తెలివిగా ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలు ప్రేక్షకులకు అంతగా నమ్మే విధంగా అనిపించవు. కానీ వీరి ప్రయత్నం బాగుంది. అనుకున్న పాయింట్ సరిగ్గానే చూపించినప్పటికి కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్లుగా అనిపిస్తోంది. సెకండాఫ్ లో లెంగ్త్ పెరిగినట్లు అనిపిస్తోంది.

మొత్తంగా :

మాస్ మహారాజా ‘రాజా ది గ్రేట్’ తో ఈ దీపావళికి మంచి హిట్ కొట్టాడు అని చెప్పవచ్చు. పూర్తిగా ఓ మంచి ఫ్యామిలీ, ఎంటర్ టైనర్ అందించాడు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చేయోచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -