వరుసగా నాలుగు ఫ్లాపులు అందుకున్న సాయిధరమ్‌తేజ్ మారలేదు. అతడికి సరైన హిట్ వచ్చి చాలా రోజులైంది. ఇప్పటివరకు ఆశించిన విజయం లేకపోవడంతో సతమతమవుతున్న సాయి మళ్లీ ఫ్లాపు దర్శకుడితో సినిమాకు ఒప్పుకున్నాడు. ‘జవాన్’, ‘ఇంటిలిజెంట్’ సినిమాలపై నమ్మకం పెట్టుకోగా అవి థియేటర్ల వద్ద సందడి చేయలేదు. వీటి తర్వాత సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమా వివరాలు తెలిశాయి.
గోపీచంద్ మలినేనితో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అసలే ఫ్లాఫ్ కాంబినేషన్.. ఈ ప్రాజెక్టు ఇక ముందుకు వెళ్లితే ఏమవుతుందో ఒకసారి సాయి ఆలోచించుకోవాల్సిందే. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. నిర్మాత బైబై చెప్పారని పుకార్లు వచ్చాయి. ఈ పుకార్ల నేపథ్యంలో వెంటనే సినిమా వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి.
ఈ సినిమాను శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించనున్నారట. ఈ సినిమాకు ‘విన్నర్’ అని టైటిల్ కూడా ప్రకటించేశాడు. ఇది పక్కా కమర్షియల్ సినిమా.. ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ చేయనటువంటి కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. సరికొత్త జోనర్ చిత్రమిది. యువ సంగీత సంచలనం ఈ చిత్రానికి సంగీతం అందింస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేపడుతున్నామని చెప్పారు. అన్నీ పూర్తయిన తర్వాత సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
