ఛానళ్లపై కేసు పెట్టిన సమంత…

- Advertisement -

నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో అనేక వార్తలు, విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన పరువుకు భంగం కలిగించారంటూ యూట్యూబ్ ఛానళ్లపై సమంత కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

సుమ‌న్ టీవీ, తెలుగు పాపుల‌ర్ టీవీ ఛాన‌ల్‌తోపాటు సీఎల్ వెంక‌ట్రావ్ అనే న్యాయవాదిపై స‌మంత ప‌రువు న‌ష్టం దావా వేసింది. త‌న‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశార‌ని, త‌న‌పై దుష్ప్ర‌చారం చేయ‌కుండా ఆదేశించాల‌ని కూకట్ పల్లి కోర్టుకు విజ్ఞ‌ప్తి చేసింది స‌మంత‌.

- Advertisement -

సోషల్ మీడియా ద్వార కొద్దిరోజుల కిందట ” నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్‌ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్‌ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది. దయచేసిన నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయకుండా దయ చూపండి” అంటు పోస్టు పెట్టింది.

నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో మ‌ళ్లీ త‌న సినీ కెరీర్‌పై దృష్టి పెట్టాల‌ని ఫిక్స్ అయింది స‌మంత‌. మ‌రోవైపు నాగ‌చైత‌న్య కూడా త‌న సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ ను ఢీ కొట్టనున్న పృథ్వీరాజ్..

టీడీపీకి మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా…!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -