టీవీ 9 అధినేత, పారిశ్రామిక వేత్త శ్రీనురాజు, టీవీ 9 రవి ప్రకాష్, నారా లోకేష్ మరి కొందరు రామ్ గోపాల్ వర్మతో కలిసి తనపై కుట్ర చేసారని పవన్ పదే పదే ట్వీట్ లు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ట్వీట్‌లకు శ్రీరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది
నావెనుక ఏ రాజకీయ పార్టీలేదని….తనకు రాజకీయ డ్రామాలు తనకు చేతకాదని ఆమె పేర్కొన్నారు. తనను చంద్రబాబు, నారా లోకేశ్, మరికొందరు రాజకీయ నేతలు నడిపిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై తన ఫేస్‌బుక్ పేజీలో స్పందించారు.
ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో అందరికీ తెలుసునని పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. మా మీద, మా తల్లులను అన్నప్పుడు రోడ్డు మీదకు రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్ పోస్తున్నప్పుడు బెదిరింపులతో భయపెడుతున్నపుడు మా బాధ అర్థం కాలేదా?’ అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.
తన ప్రాణం పోయినా లెక్కచేయబోనని, వీర మరణానికి సిద్ధమని ప్రకటించారు. ‘మీ ఆధిపత్యం సినిమాల్లో చూపించండి. ‘ మా’ఫిలిం ఛాంబర్ మీద చూపించకండి. జర్నలిస్టుల మీద బురద చల్లితే మీ మీదే మరకలు పడతాయి. జర్నలిస్టుల జోలికి వస్తే బాగుంద’ని హెచ్చరించారు.
