Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. థియేటర్లు కళకళ..!

- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ ద్వితీయార్థంలో థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జూలై ఆఖరి వరకూ సినిమా హాళ్లు తెరుచుకోలేదు. రెండు వారాల సుదీర్ఘ విరామం తర్వాత ఇష్క్, తిమ్మరుసు సినిమాలు విడుదల అయ్యాయి. గత వారం ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా విడుదలైంది. ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. దీంతో నిర్మాతలకు ధైర్యం వచ్చింది.

షూటింగ్ ముగిసి అంతా సిద్ధంగా ఉన్న సినిమాలు వరుసగా థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఇవాళ, రేపు ఏకంగా పది సినిమాలు విడుదల అవుతున్నాయంటే సినిమాల విడుదలకు నిర్మాతలు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. అలాగే వచ్చే శుక్రవారం శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజ రాజ చోర సినిమాతో పాటు పలు చిన్న సినిమాలు కూడా వచ్చే వారం విడుదల కానున్నాయి.

ఇక ఈనెల 27 న శుక్రవారం మూడు సినిమాలు విడుదల కానున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న శ్రీదేవి సోడా సెంటర్, సుశాంత్ కథానాయకుడిగా వస్తున్న ఇచ్చట వాహనములు నిలుపరాదు, అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలు విడుదల కానున్నాయి. థియేటర్లు తెరుచుకోగానే ముందుగా చిన్న సినిమాలన్నీ క్యూ కట్టగా ఇప్పుడు మీడియం బడ్జెట్, హై రేంజ్ బడ్జెట్ సినిమాలు కూడా వరుసగా థియేటర్లలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.

Also Read

సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -