షూటింగ్ లు ప్రారంభం .. ఆ సినిమాలకే ప్రాధాన్యం..!

- Advertisement -

కరోనా సెకండ్​ వేవ్​ క్రమంగా అదుపులోకి వస్తున్నది. కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఈ క్రమంలో లాక్​డౌన్​ ఎత్తేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఫిలిం చాంబర్​ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. షూటింగ్​లకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

కరోనా సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​తో చాలా సినిమాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్​ తుదిదశకు చేరుకున్న సినిమాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఫిలిం చాంబర్​ నిర్ణయం తీసుకున్నది. ముందుగా తుదిదశకు చేరుకున్న సినిమాల షూటింగ్​ పూర్తయ్యాకే మిగిలిన షూటింగ్​లు ప్రారంభించాలని నిర్ణయించింది. థియేటర్లు ఓపెన్ అయితే విడుదల చేసేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఫిలిం చాంబర్ ముందుకు షూటింగ్​ తుది దశకు చేరుకున్న సినిమాలకు అవకాశం కల్పించింది.

Also Read: ఇక చక చకా ఆదిపురుష్​ షూటింగ్​.. ప్రభాస్​ లేకుండానే..!

మరోవైపు కొన్ని సినిమాలు షూటింగ్​ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాయి. తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20తో కరోనా పొడిగింపు పూర్తికాబోతున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ నేతృత్వంలోని క్యాబినేట్ సమావేశమై లాక్​డౌన్​పై తుది నిర్ణయం తీసుకొనే చాన్స్​ ఉంది.

Also Read: బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -