Saturday, May 4, 2024
- Advertisement -

తెలుగు వేడుక‌ల్లో ఉద‌య‌భాను ఇంగ్లీష్ యాంక‌రింగ్‌

- Advertisement -
  • ప్రైవేట్ కార్య‌క్ర‌మంగా అరుపులు, కేక‌లు
  • సోష‌ల్‌మీడియాలో ఆమెపై ఫైర్‌

ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌లు తెలంగాణ ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తోంది. దీనికోసం హైద‌రాబాద్‌న్నంతా ముస్తాబు చేసి తెలుగు పండుగ‌ను ప్ర‌జ‌ల ముందుకు తెచ్చింది. ఐదు రోజుల పాటు ఆర్బాటంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. అంద‌ర్నీ ఆహ్వానం ప‌లుకుతూ తెలుగు భాష అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ప్ర‌ణాళిక‌లు త‌దిత‌ర వాటిపై చ‌ర్చించ‌డానికి ఈ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో అంద‌రూ తెలుగులో మాట్లాడారు. మాట్లాడ‌డానికి రాకున్నా క‌నీసం ప్ర‌య‌త్నించారు. కానీ ఈ వేడుక‌ల్లో ఉద‌య‌భాను యాంక‌రింగ్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆమె తెలుగు మ‌హాస‌భ‌ల వేదిక‌పై ఇంగ్లీష్‌లో యాంక‌రింగ్ చేసి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. హ హు, వెల‌క‌మ్ సార్‌, స్టేజీపైకి, యాక్ట‌ర్‌, డైలాగ్ కింగ్ అని త‌దిత‌ర ఇంగ్లీష్ ప‌దాల‌తో నానా సంద‌డి చేసింది.

ఆంగ్ల ప‌దాల‌తో యాంక‌రింగ్ చేసి ఇది తెలుగు స‌భ‌లు కాదు ఏదో ఆడియో కార్య‌క్ర‌మం మాదిరి, సినీ కార్య‌క్ర‌మం మాదిరి అరుపులు, కేక‌ల‌తో త‌న రొటీన్ యాంక‌రింగ్ చేసింది. ఆ విధంగా చేయ‌డంతో తెలుగు అభిమానుల‌కు వెగ‌టు పుట్టింది. తెలుగు మ‌హాస‌భ‌ల్లో చ‌క్క‌గా తెలుగు మాట్లాడొచ్చు క‌దా అని స‌భ‌కు వ‌చ్చిన వారంద‌రూ గొణుక్కున్నారు. ఇంత పెద్ద కార్య‌క్ర‌మానికి ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మై వ‌స్తే ఇలాంటి క‌ష్టం వ‌చ్చి ఉండేది కాద‌ని చెబుతున్నారు. సాధార‌ణ తాను చేసే కార్య‌క్ర‌మాలైతే ప‌ర్వాలేదు గానీ తెలుగు భాష కోసం చేస్తున్న కార్య‌క్ర‌మాల్లో ఆంగ్ల ప‌దాలు విచ్చ‌ల‌విడిగా వాడి అస‌లు అది తెలుగు పండుగ మాదిరి లేకుండా చేసింది.

రిక్వెస్ట్ చేస్తున్నాం.. స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూస‌ర్స్‌, అంద‌ర్నీ సార్‌ అని, క‌న్ యు హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్‌, మా ప్రెసిడెంట్ అని, డైరెక్ట‌ర్స్ అని, లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఇలా అన్ని ఆంగ్ల ప‌దాలు వాడుతూ ఈ వేడుక‌ల‌ను ఉద‌య‌భాను ఉప‌యోగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -