వెబ్​సీరిస్​లో నటించబోతున్న దగ్గుపాటి హీరోలు..!

- Advertisement -

ప్రస్తుతం ఓటీటీయుగం నడుస్తోంది. వెబ్​సిరీస్​ల హవా కొనసాగుతోంది. కరోనా లాక్​డౌన్​తో థియేటర్లు మూతపడటం ఓటీటీకి కలిసివచ్చింది. అయితే బాలీవుడ్​లో ఇప్పటికే పలువురు నటులు వెబ్ సిరీస్​లో నటించి మెప్పించారు. కానీ తెలుగులో అగ్రహీరోలు ఇప్పటివరకు వెబ్ సీరిస్​లో నటించేందుకు ఒప్పుకోలేదు. మంచి కథ సిద్ధమైతే వెబ్​సీరిస్​లో నటించేందుకు సిద్ధమేనని అక్కినేని నాగార్జున ప్రకటించాడు. ఇప్పటికే ఆయన పలు కథలు కూడా విన్నాడు.

ఇదిలా ఉంటే తాను ఓ వెబ్​సిరిస్​లో నటించబోతున్నట్టు వెంకటేశ్​ సంచలన ప్రకటన చేశాడు. రానా దగ్గుపాటితో కలిసి వెబ్​సిరిస్ లో నటించబోతున్నట్టు చెప్పాడు. ఈ వెబ్​సిరిస్​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ కానున్నట్టు సమాచారం. ప్రయోగాలు చేసేందుకు వెంకటేశ్​ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం కమర్షియల్​ ఫార్ములా సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఆడియన్స్​ అభిరుచుల్లో మార్పురావడమే అందుకు కారణం.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రాధే శ్యామ్ తాజా అప్డేట్ ఏమిటంటే ..!

హీరోలంతా విభిన్న కథాంశాల్లోనే నటిస్తున్నారు. ఇక వెంకటేశ్​ కూడా వెబ్​సీరిస్​లో నటించాలని భావిస్తున్నారు. రాబోయేది ఓటీటీ యుగం కావడంతో అందుకు తగ్గట్టుగా వెంకటేశ్​ కూడా తన సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే వెంకటేశ్​ హీరోగా నటించిన నారప్ప రేపు ఓటీటీలో విడుదల కాబోతున్నది. ఒకవేళ వెంకటేశ్​ చేయబోయే వెబ్​సీరిస్​ సక్సెస్​ అయితే మరికొందరు అగ్ర నటులు సైతం ఇటువైపుకు వచ్చే చాన్స్​ ఉంది.

Also Read: ‘అలవైకుంఠపురములో ’ హిందీ రీమేక్​లో అల్లు అర్జున్​ గెస్ట్ రోల్​..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -