Monday, May 6, 2024
- Advertisement -

తెలుగు తమిళ్ మద్య చిచ్చు పెట్టిన విజయ్ తలపతి!

- Advertisement -

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి ప్రస్తుతం తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు. గతంలో కేవలం తమిళ్ వరకే పరిమితం అయిన ఈ స్టార్ హీరోకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. విజయ్ నుంచి తుపాకి, బిగిల్, అదిరింది, పోలీస్, వంటి సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అనుడుకున్నాయి. ఇక ఆ మద్య వచ్చిన మాస్టర్ మూవీ తెలుగులో స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్లు రాబట్టింది. దీంతో విజయ్ అప్ కమింగ్ మూవీస్ పై తెలుగులోను మంచి హైప్ ఉంది. ప్రస్తుతం విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ” వారిసు ” అనే మూవీ చేస్తున్నాడు. .

ఈ మూవీ తెలుగులో “వారసుడు ” గా రాబోతుంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రా యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.. ఈ మూవీకి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత కావడంతో తెలుగులో కూడా అధిక ధియేటర్లలో ఈ మూవీ ప్రదర్శితం అయ్యే విధంగా దిల్ రాజు ప్లాన్ చేశాడట. దాంతో ఇదే సంక్రాంతి బరిలో దిగుతున్న మెగాస్టార్ చిరు వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహరెడ్డి మూవీస్ కు థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో.. దీనిపై తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయానికి వచ్చింది.

పండగ సీజన్ లలో ముందుగా తెలుగు సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తరువాతనే డబ్బింగ్ సినిమాలకు ఛాన్స్ అంటూ ఓ లేఖను విడుదల చేసింది తెలుగు నిర్మాతల మండలి. దీనిపై తమిళ్ ఇండస్ట్రీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. తెలుగులో విజయ్ సినిమాను తక్కువ చేస్తే.. తమిళ్ లో విడుదల అయ్యే తెలుగు సినిమాలను అడ్డుకుంటామని తమిళ్ నిర్మాతల నుంచి వార్నింగ్ లు వినిపిస్తున్నాయి. ఇదే ఇష్యూ పై తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి కూడా తెలుగు నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తెలుగులో విజయ్ సినిమాను అద్దుకుంటే.. పరిస్థితులు వారసుడు ముందు వారసుడు తరువాత అనే విధంగా ఉంటాయని కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో విజయ్ వారసుడు మూవీ తెలుగు తమిళ్ ఇండస్ట్రీ మద్య అగ్గి రాజేసింది. మరి దీనిపై తుది నిర్ణయం ఎలా ఉంటుదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆదిపురుష్ కు సవాల్ గా హనుమాన్ !

“ప్రాజెక్ట్ కే” మామూలుగా ఉండదట!

హీరోలను విలన్లుగా మారుస్తున్న స్టార్ డైరెక్టర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -