అక్కినేని నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. వారసత్వంతో ఎంట్రీ అయితే ఈజీగానే దొరికింది కాని సక్సెస్‌లు మాత్రం రావడం లేదు. అఖిల్ నటించిన మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడగలడా అనే అనుమానం అందరిలోను మొదలైంది. కాస్తా గ్యాప్ తీసుకుని మరి మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం చెందిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాని సినిమా యూనిట్ మాత్రం మా సినిమా సూపర్ హిట్ అని ఊదరగొడుతోంది. ఏకంగా మిస్టర్ మజ్ను సినిమా సూపర్ హిట్ అని విజయయాత్రను మొదలుపెట్టేశారు చిత్ర యూనిట్. ఇది చూసిన నెటిజన్లు ప్లాప్ సినిమాకు విజయయాత్రలు ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఫలితం కలెక్షన్ల మీద కూడ కనిపిస్తోంది. మిస్టర్ మజ్ను సినిమా మొదటి వీకెండ్‌లో 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయిందని అంటున్నారు. దీంతో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ అక్కినేని నట వారసుడు.
- ‘కాంచన 4’ లో లేడీ సూపర్ స్టార్!
- వంతెన మీద నుండి యువతిని తోసేశారు.. వీడియో వైరల్!
- రష్మికను కాపాడిన కృతి సనన్..!
- విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు?
- బీఆర్ఎస్లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్?
