Saturday, May 11, 2024
- Advertisement -

తెలుగువాడిగా పుట్ట‌డ‌మే విశాల్ చేసిన త‌ప్పా..?

- Advertisement -

త‌మిళ హీరో అయిన విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. విశాల్ న‌టించిన సినిమాలు తెలుగులో కూడా విడుద‌ల‌వుతుంటాయి. అయితే విశాల్ త‌మిళ నిర్మాత మండలికి అధ్య‌క్షుడు అయిన ద‌గ్గ‌ర నుంచి ఓ వ‌ర్గం విశాల్‌పై క‌క్ష్య క‌ట్టింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత విశాల్ చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. చాలా వరకు అవినీతి లేకుండా అంతా పారదర్శకంగా ఉండేలా చూశాడు. అక్క‌డ విశాల్ హీరో క‌న్నా ఎక్కువ అనే చెప్పాలి.

త‌న‌కు వ‌చ్చే దానిలో రైతుల‌కు స‌హయం చేస్తుంటాడు. ఇదే కాక రైతులు త‌రుపున కేంద్ర ప్ర‌భుత్వంతో కూడా చ‌ర్చలు జ‌రిపి వారికి న్యాయం జ‌రిగేలా చేశాడు విశాల్‌. ఇక్క‌డే మొద‌లైంది అస‌లు క‌థ‌. హీరో విశాల్ ఎలాంటి వ్య‌క్తో అంద‌రికి తెలిసిందే. విశాల్ ఓ రాజ‌కీయ నాయకుడు క‌న్నా ఎక్కువ ఎదుగుతున్నాడ‌ని భావించిన విశాల్ వ్య‌తిరేక వ‌ర్గం అత‌నిపై కుట్ర‌లు చేస్తుంది. దీనికి కార‌ణం విశాల్ తెలుగు వాడు కావ‌డం. ఓ తెలుగు వాడు వ‌చ్చి మ‌న విష‌యంలో జోక్యం చేసుకోవ‌డంపై అక్క‌డ ఉన్నవారికి న‌చ్చ‌డం లేదు. దీంతోనే నిర్మాత‌ల్ని పావులుగా చేసుకుని విశాల్‌పై పోరాటానికి దిగారు అత‌ని వ్య‌తిరేక వ‌ర్గం. నడిగర్ సంఘానికి తాళం వెయ్యడం ,ఆ తాళం తీసేందుకు ప్రయత్నించిన విశాల్ ను పోలీసులు అరెస్ట్ చేయడం అంతా ఒక సీరియల్ డ్రామాలా జరిగిపోయింది.

ఈ విష‌యంలో ఎలాగైన విశాల్‌ను దోషిగా నిల‌పాల‌ని వారు భావిస్తున్నారు. దీనికి విశాల్ కూడా ఎక్క‌డ త‌గ్గ‌డం లేదు. నిర్మాత మండ‌లిలో లేని కొంద‌రు ఇలా చేస్తున్నార‌ని,వారి భ‌య‌డేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు విశాల్‌. అస‌లే ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉన్న త‌మిళ‌నాడు రాష్టంలో ఇలా తెలుగువాడు వారిపై పెత్త‌నం చేస్తే చూస్తు ఊరుకుంటారా..? కానీ విశాల్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా… సినిమాలు సమాజ సేవతో అక్కడి ప్రజల గుండెల్లో హీరోగా మారాడనే చెప్పాలి. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసిన విశాల్‌పై ఉన్న అభిమానం చెరిగిపోద‌ని అంటున్నారు ఆయ‌న అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -