Wednesday, May 1, 2024
- Advertisement -

బాలీవుడ్​ను ఆదుకొనేది అక్షయేనా?

- Advertisement -

కరోనాతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. ఫస్ట్​వేవ్​తో నష్టాల పాలైన సినిమా ఇండస్ట్రీ.. సెకండ్​ వేవ్​తో కోలుకోలేని దెబ్బతిన్నది. ముఖ్యంగా ఈ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు వీధినపడ్డారు. బాలీవుడ్​మీద కరోనా ప్రభావం ఎక్కువ పడింది. అందుకు కారణం.. బాలీవుడ్​ అంటే ముంబై.. కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో షూటింగ్​ లు నిలిచిపోయిన పరిస్థితి. పలువురు సినీ కార్మికులు సైతం కరోనాకు బలయ్యారు.

కరోనా కారణంగా బాలీవుడ్​ లో ఇప్పుడు అక్షయ్ కుమార్​ సినిమాలు అధికంగా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయాయి. అందుకు కారణం బాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేసేది అక్షయ్యే. అన్ని జోనర్లలో నటించడం అక్షయ్ స్టయిల్​. ఎన్నో విభిన్న పాత్రలు, కామెడీ పాత్రలు, యాక్షన్​ పాత్రలు చేస్తూ ఆడియన్స్​ను ఎంటర్​ టెయిన్​ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్​ గాడిన పడాలంటే అక్షయ్​ సినిమాలు రిలీజ్​ కావాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు . ప్రస్తుతం కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఆగస్టులో థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉందని అంచనాలు వస్తున్నాయి.

Also Read:ఈ సారి పవన్ నుంచి ఫన్ ఒక్కటే కాదు.. మెసేజ్ కూడా..!

మరోవైపు థర్డ్​వేవ్​ కూడా భయపెడుతున్నది. అక్షయ్ నుంచి సుమారు 6 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘సూర్యవంశీ’ ‘బెల్‌బాటమ్‌’, ‘ఆత్రంగి’ వంటి సినిమాల షూటింగ్​ దాదాపు పూర్తయ్యింది. ఇక ‘బచ్చన్ పాండే’, ‘రక్షాబంధన్’, రామ్ సేతు’ సినిమాలు కూడా షూటింగ్​ జరుపుకుంటున్నాయి. ఇవి కాక ‘పృథ్వీ రాజ్’ అనే భారీ చిత్రం రెడీగా ఉంది. ఈ చిత్రాలన్నీ వెంట వెంటనే విడుదలైతే .. బాలీవుడ్​ ఇండస్ట్రీ కోలుకొనే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.మొత్తానికి బాలీవుడ్​ను కాపాడే బాధ్యతను అక్షయ్​ తన భుజస్కందాలమీద వేసుకున్నాడన్నమాట.

Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -