Saturday, May 4, 2024
- Advertisement -

జ‌గ‌న్ అందుకే ‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదా..?

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖ‌ర రెడ్డి రాజ‌కీయ జీవితంలోని ప్ర‌ముఖ ఘ‌ట్ట‌మైన పాదయాత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్ర‌ను మాళ‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టించారు. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రు రాలేదు అనే దాని క‌న్నా చిత్ర యూనిట్ ఎవ‌రిని పిల‌వ‌లేదంటే బాగుంటుంది.

హీరో సుధీర్ బాబు ఒక్క‌డే ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు వైఎస్ఆర్ అభిమానులే ఈ సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌లు. వైఎస్ఆర్ ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిపొందిన వారిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌లుగా తీసుకువ‌చ్చారు చిత్ర యూనిట్. వైఎస్ఆర్ మ‌ర‌ణించి 10 సంవ‌త్స‌రాలు కావస్తోన్న ఇప్ప‌టికి ఆయ‌న ప్ర‌జ‌ల‌లో ఇంకా బ్ర‌తికే ఉన్నార‌ని చాలామంది న‌మ్ముతుంటారు. ‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే బాగానే జ‌రిగింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జ‌గ‌న్ ఎందుకు రాలేద‌ని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు.చిత్ర యూనిట్ జ‌గ‌న్‌ను పిల‌వ‌లేదా..? పిలిచిన జ‌గ‌న్ రాన‌న్నారా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే చిత్ర ద‌ర్శ‌కుడు జ‌గ‌న్‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పిలిచిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిని సున్నితంగా తిరస్క‌రించాడ‌ని స‌మాచారం. నేను వ‌స్తే యాత్ర సినిమాను రాజ‌కీయ కోణంలో చూస్తార‌ని అలా చూడ‌టం నాకు ఇష్టం లేద‌ని , అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేన‌ని తెలిపాడ‌ట జ‌గ‌న్‌.

నాన్న‌గారి వ‌ల్ల అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగింద‌ని , ఆయ‌న‌ను అభిమానించే వాళ్లు అన్ని పార్టీల‌లో ఉన్నార‌ని చెప్పుకొచ్చార‌ట జ‌గ‌న్. నేను వ‌స్తే సినిమాను రాజ‌కీయ కోణంలో చూస్తారని అందుకే తాను రాలేన‌ని జ‌గ‌న్ చిత్ర ద‌ర్శ‌కుడికి తెలిపాడ‌ట‌. కాని జ‌గ‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చి ఉంటే బాగుండేద‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ వ‌చ్చి ఉంటే సినిమాకు బ‌జ్ పెరిగేద‌ని వైఎస్ఆర్ అభిమానులు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు,మ‌ళ‌యాళ భాష‌ల‌లో ఈ నెల 8న విడుద‌ల చేస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు,అన‌సూయ‌లు సినిమాలోని కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -