Friday, April 26, 2024
- Advertisement -

అంతా రక్తం.. మొత్తం హింస, పొలింగ్ వాయిదా..!

- Advertisement -

బెంగాల్​ నాలుగో విడత ఎన్నికల వేళ కూచ్​బెహర్​ జిల్లాలోని సీతల్​కుచి నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు నలుగురు టీఎంసీ మద్దతుదారులుగా టీఎంసీ పేర్కొంది. ఈ క్రమంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం సందర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మృతుల కుటుంబాలను కలవనున్నట్లు సమాచారం.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో కూచ్​బెహార్​ జిల్లా సీతల్​కుచి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రం 126లో ఓటింగ్​ వాయిదా వేయాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. ప్రత్యేక పరశీలకుల మధ్యంతర నివేదిక ప్రకారం ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి స్థాయి నివేదికను ఈరోజు 5 గంటల లోపు ప్రధాని ఎన్నికల అధికారికి సమర్పించాలని ఆదేశించింది.

మరోవైపు కూచ్‌బెహ‌ర్‌లో కాల్పుల ఘటనలో ఐదుగురు మృతిచెంద‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ విచారం వ్య‌క్తం చేశారు. పోలింగ్ సంద‌ర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ఐదుగురు మృతిచెంద‌డం క‌ల‌చివేసింద‌న్నారు. వారి మృతికి సంతాపం వ్య‌క్తంచేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. బీజేపీకి పెరుగుతున్న మ‌ద్ద‌తును చూసి త‌ట్టుకోలేక దీదీ, ఆమె గూండాలు ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మోదీ ఆరోపించారు. 

నాయిని ఇంట్లో సోదాలు..10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు..!

తగ్గేదే లే.. అదే రక్తం, అదే వారసత్వం, అదే చిరునవ్వు..!

ప‌వ‌న్ లో జోష్ చూస్తుంటే మహాఆనందంగా ఉంది : చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -