గిరిజన జాతుల మధ్య హింస.. చివరికి 80 మంది మృతి..!

- Advertisement -

ఇథియోపియాలోని పశ్చిమ బెనిషంగుల్-గుముజ్ ప్రాంతంలో చెలరేగిన హింసలో 80మంది పౌరులు మరణించారని ఆ దేశ మానవ హక్కుల కమిషన్(హెచ్​ఆర్​సీ)​ ప్రకటించింది. మారణహోమాన్ని వెంటనే నిలిపివేయాలని, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది.

మెక్​టెల్​ ప్రాంతంలో హింస జరిగిందని ఇథియోపియా మీడియా వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారని.. దీనితోపాటు దాదాపు 100మంది వరకు మరణించారని తెలిపింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన హెచ్​ఆర్​సీ హింసకు దూరంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

ఈ దేశంలో దాదాపు 80 గిరిజన జాతులున్నాయి. ఓవైపు వీటిని ఏకం చేయాలని ప్రధాని అభియ్​ అహ్మద్​ ప్రయత్నిస్తుంటే… మరోవైపు ఈ హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...