ప‌వ‌న్ లో జోష్ చూస్తుంటే మహాఆనందంగా ఉంది : చిరంజీవి

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా ఒక పవర్ ఫుల్ కథతో సినిమా చేయడంతో పవన్ అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు.  ముఖ్యంగా ఈ మూవీ చూసి మహిళాలోకం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి  వకీల్ సాబ్ సినిమాను కుటుంబ సమేతంగా ఈ సినిమా వీక్షించారు.

“మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతంగా ఉంది. నివేద థామస్, అంజలీ, అనన్య వారి పాత్రల్లో జీవించారు. సినిమాకు తమన్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. అలాగే దిల్ రాజుకు, బోణి కపూర్ జీ కి, దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమందరికి నా శుభాకాంక్షలు.

- Advertisement -

అన్నింటింకి మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం ఇది. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసులను గెలుస్తాడు. అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. కాగా, వ‌కీల్ సాబ్ సినిమాకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -