నక్సల్స్ తో భీకర పోరు.. జవాన్లు అదృశ్యం..!

- Advertisement -

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ జిల్లాలో శనివారం నక్సల్స్​కు, జవాన్లకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్ అనంతరం ​21 మంది భద్రతా సిబ్బంది అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయని ఛత్తీస్​గఢ్​ పోలీసు వర్గాలు తెలిపాయి. 23 మంది గాయపడగా.. బీజాపుర్​ ఆసుపత్రికి తరలించామని, మరో ఏడుగుర్ని రాయ్​పుర్​ ఆసుపత్రికి తరలించామని చెప్పాయి.

బీజాపుర్​లోని తారెం ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో 10 మందికి గాయాలయ్యాయని ఛత్తీస్‌గఢ్​ డీజీపీ అవస్థీ తెలిపారు. నక్సల్ ఏరివేతలో భాగంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని.. దీంతో భద్రతా దళాలు దాడి చేశాయని చెప్పారు.

- Advertisement -

ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొమ్మిది మంది నక్సల్స్ మరణించి ఉంటారని బస్తర్ ఐజీ పీ సుందర్​ రాజ్ వెల్లడించారు. మరో 15 మంది గాయపడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు మరింత సమయం కావాలని చెప్పారు. తమ అంచనా ప్రకారం ఘటన జరిగిన ప్రాంతంలో 250 మంది నక్సల్స్ ఉన్నారన్నారు.

మళ్లీ చుక్కలనంటుతున్న బంగారం.. అదే బాటలో వెండి!

పదో తరగతి బాలికపై అత్యాచారం.. నిందితుడిని కాల్చిన పోలీసులు!

నేటి పంచాంగ, ఆదివారం (4-4-2021)

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -