Thursday, May 2, 2024
- Advertisement -

ఛత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు.. ఐదుగురు మృతి!

- Advertisement -

ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  బీజాపూర్ జిల్లా లో జవాన్ లకు మావోల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 గురు జవాన్లు మృతి చెందగా ఒక్క మహిళా మావోతో పాటు మరో ఇద్దరు మావోలు మృతి చెందారు. మరణించినవారిలో ముగ్గురు సిఆర్ పిఎఫ్ జవాన్లు, ఇద్దరు డిఆర్ జి జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

పోలీసు-మావోయిస్టుల ఎన్‌కౌంటర్ కేసు తారెం పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జోన్నాగుడ వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతాసిబ్బంది శనివారం నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ క్రమంలో నక్సల్స్‌ కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మా బృందంతో ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. తిరిగి పార్టీని ఘటనా స్థలానికి తరలించారు. ఈ సంఘటన పై సీనియర్ పోలీసు అధికారులు నిఘా ఉంచారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -