- Advertisement -

బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా..జాగ్రత్త!

- Advertisement -

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మూడురోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని మళ్లీ వేడి చేసి ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్న ఘటన బంజారాహిల్స్ ప్రాంతంలో బయటపడింది.జీడిమెట్లలో బిర్యానీ తయారు చేసి, ఫ్రిజ్‌లో వందలాది ప్యాకెట్లుగా నిల్వ ఉంచుతున్నారు. ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా వాటిని ఓవెన్‌లో వేడి చేసి, Zomato ద్వారా కస్టమర్లకు పంపిస్తున్నట్లు సమాచారం.

బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో “లక్కీ బిర్యానీ అండ్ షోర్మా” పేరుతో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారని వెల్లడైంది. బయటకు మంచి ఫుడ్ అందిస్తున్నట్లు చూపిస్తూ, లోపల మాత్రం పాత ఆహారాన్ని కొత్తలా అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కస్టమర్లకు తాజా బిర్యానీ అని నమ్మబలికించి, వాస్తవానికి పాత బిర్యానీనే అందిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని చెబుతున్నారు.

ఆరోగ్యానికి ముప్పు

ఇలాంటి పాత ఆహారం తినడం వల్ల:

ఫుడ్ పాయిజనింగ్
జీర్ణ సమస్యలు
ఇన్ఫెక్షన్లు
వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధికారుల చర్యలు అవసరం

ఈ ఘటనపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో కస్టమర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. హైజీన్, రేటింగ్స్, రివ్యూలు తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -