ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. వృద్దురాలిపై మానవ మృగాళ్ల అకృత్యాం!

- Advertisement -

దేశంలో రోజు రోజుకీ మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. వృద్దులు, చిన్నారులు అని కూడా చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది.  బదౌన్‌ జిల్లాలో 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా మానవ మృగాలు రెచ్చిపోయారు. దేవాలయానికని వెళ్లిన ఓ మహిళపై కొంతమంది కామాంధులు సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను చిత్రవధ చేశారు. ఆమె పక్కటెముకలు విరిచేశారు. రెండు కాళ్లు విరగొట్టారు. అంతకంటే దారుణాతి దారుణంగా ఆమె ప్రైవేటు అవయవాలను దారుణంగా గాయపరిచారు. 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బదౌన్‌ జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న 50ఏళ్ల మహిళ ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఉండే ఓ దేవాలయానికి వెళ్లింది. గుడికి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో ఆలయ పూజారి మరో ఇద్దరు కలిసి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఇంటికి తీసుకొచ్చినట్లు ఆమె కొడుకు చెప్పాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేలోపు కన్నుమూసింది.

- Advertisement -

అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించారు. పోస్టుమార్టంలో దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను సదరు నిందితులు తీవ్రంగా గాయపర్చినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...