మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన ఘటనలో బాధిత యువతి చివరకు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
గత నెల 11న మనోహర్ అనే యువకుడు, పెళ్లికి నిరాకరించిన యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఎక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటన అప్పట్లోనే సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్‌ను అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన వల్ల తీవ్ర మనోవేదనకు గురైన యువతి, ఇవాళ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.యువతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
