- Advertisement -

జగన్ మేనిఫెస్టో..టీడీపీ పని ఖతం!

- Advertisement -

2019లో నవరత్నాలతో వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ ఏపీ చరిత్రలోనే తిరుగులేని విధంగా సీట్లను సాధించి విజయం సాధించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను అమలు చేయడమే కాదు మేనిఫెస్టోలో ఇవ్వని స్కీమ్‌లను కూడా అమలు చేసి పీపుల్స్ సీఎం అనిపించుకున్నారు.

వైనాట్ 175 అని నినాదాన్ని ఎంచుకున్న జగన్.. ఆ విధంగా ప్రణాళికను రచించి ముందుకుసాగుతున్నారు. ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉండటంతో టీడీపీ అవినీతికి తోడు వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక దీనికి తోడు టీడీపీ దిమ్మ తిరిగేలా మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు జగన్. మళ్లీ వైసీపీదే అధికారం అని..ప్రజల్లో తమపై అంత వ్యతిరేకత లేదని సర్వేలు కూడా చెబుతున్న తరుణంలో జోష్‌లో ఉన్న జగన్‌..టీడీపీకి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా అన్నిదారులను మూసేయాలని భావిస్తున్నారు.

మాట ఇస్తే జగన్ వెనక్కి తగ్గని నైజం జగన్‌ని అందుకే గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాకర్షక పాలన చేసిన జగన్‌…ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఉండేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా రుణమాఫీ ఉండనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీతో పాటు మహిళల కోసం అదిరే స్కీమ్ తీసుకురానున్నారట. అదే విధంగా అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా రెండోసారి అధికారంలోకి రావడానికి ఉపయోగపడే ఏ చిన్న ఛాన్స్‌ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు జగన్.

ఇప్పటికే బాబు అరెస్ట్, రిమాండ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు జగన్. అయితే టీడీపీకి మాత్రం చంద్రబాబు అరెస్ట్ సానుభూతి తప్ప ప్రజల ముందుకు వెళ్లడానికి వేరే ఆప్షన్ లేదు. కానీ బాబు అరెస్ట్ అయి నెలరోజులు అవుతున్న ప్రజలు అంతగా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే రెండోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమనే టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -