ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపులు టాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జానీ మాస్టర్‌పై కేసు నమోదు కాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకుంది.
ఈ సందర్భంగా నటి ఝాన్సీ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అన్ ఆర్గనైజెడ్ సెక్టార్ అన్నారు. ప్రభుత్వం తరపు నుంచి మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ నిమిత్తం సరైన గైడ్ లైన్స్ లేవు అని తెలిపారు. శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయిందనా లెలిపిన ఝాన్సీ.. జానీ మాస్టర్ ఇష్యూ గత రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉందన తెలిపింది.
బాధితురాలితో పాటు జానీ మాస్టర్ నుండి వివరాలను సేకరించామని, 90 రోజుల లోపే దీనిపై క్లారిటి వస్తుందని తెలిపారు ఝాన్సీ. అమ్మాయిలు ఎవరైనా కంప్లైట్ చేస్తే ఆమె వివరాలు గోప్యంగా ఉంచబడతాయని.. ఈ కేసులో బాధితురాలి వివరాలు, ఫొటోలు ఎవరూ రివీల్ చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు ఝాన్సీ.
లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చునన్నారు. ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల సమయంలో ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. వాట్సాప్ నెంబర్ 9849972280, [email protected] మొయిల్, లేదంటే.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి.రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096 పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఫిర్యాదులను పంపవచ్చునన్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఝాన్సీ.
