Saturday, May 4, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు షాక్..రైతుల పోటీ!

- Advertisement -

తెలంగాణ నామినేషన్ల పర్వం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ప్రధాన పార్టీల్లో నామినేషన్ల హడావిడి నెలకొంది. ఇక ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది అధికార బీఆర్ఎస్. ఓ వైపు సీఎం కేసీఆర్, మరోవైపు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇక ఈ సారి రెండు స్థానాలు గజ్వేల్, కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న రెండో స్థానం కామారెడ్డి నుండి పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు పౌల్ట్రీ రైతులు సిద్ధమవుతున్నారు. పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్న తమ డిమాండ్‌ను బీఆర్ఎస్ పట్టించుకోలేదని దానికి నిరసనగా నామినేషన్లు వేస్తున్నామని పౌల్ట్రీ రైతులు తెలిపారు. రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగానే పౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలని కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్లు పౌల్ట్రీ రైతులు చెప్పారు.

దీంతో కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచేవారి సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌పై పోటీకి 1,016 నామినేషన్లు వేస్తామని కాయితీ లంబాడీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పౌల్ట్రీ రైతులు సైతం సిద్ధమవుతుండటంతో కామారెడ్డి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -