Saturday, May 4, 2024
- Advertisement -

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో విపక్షాల అడ్రస్ గల్లంతేనా?

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది. పెన్షన్‌,కేసీఆర్ బీమా,గృహలక్ష్మీ,రైతు బంధు పెంపు ఇలా ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోతో విపక్షాల అడ్రస్ గల్లంతేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు, ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తాం అని తెలిపారు. ఇక అధికారంలోకి రాగానే పేద మహిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తామని తెలిపారు.

ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఇక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని…సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందుతుందని ప్రకటించారు.
సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారని…. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం అని వెల్లడించారు.

ఇక కేసీఆర్ బీమా -ప్రతి ఇంటికి ధీమా కానుందని….తెలంగాణ అన్నపూర్ణ -సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇక ఆసరా పింఛన్లు -రూ. 5వేలకు పెంపు అలాగే దివ్యాంగుల పింఛన్లు – రూ. 6వేలకు పెంచుతామని ప్రకటించారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు, అర్హులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, కేసీఆర్ అరోగ్య రక్ష – ఉద్యోగుల వలె జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామన్నారు.

హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తామని,అగ్ర వర్ణ పేదలకు 119 గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనాథ పిల్లల భవిత కోసం ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని, అసైన్డ్ ల్యాండ్ పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలు చేపడతామని ప్రకటించారు. ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేశారు సీఎం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -