రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాలుతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన వారోత్సవాల్లో’ భాగంగా ముఖ్యమంత్రి పలు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1మహబూబ్ నగర్, మక్తల్, డిసెంబర్ 2 ఖమ్మం కొత్తగూడెం,డిసెంబర్ 3 కరీంనగర్ హుస్నాబాద్, డిసెంబర్ 4 ఆదిలాబాద్ ,డిసెంబర్ 5వరంగల్ నర్సంపేట, డిసెంబర్ 6న ల్గొండ దేవరకొండలో పర్యటించనున్నారు. ఈ సభల నిర్వహణకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పర్యటనల ద్వారా ముఖ్యమంత్రి గారు గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు.
