తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే గుడ్ న్యూస్ అందించనున్నారు.పేదవారి సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లపథకంపై గుడ్ న్యూస్ చెప్పింది. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి త్వరలోనే ఆదేశాలు జారీకానుండగా ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం అందజేయనున్నారు. రెండో దశలో లబ్దిదారులకు ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందించేలా పథకాన్ని రూపొందించారు.
తొలిదశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున మంజూరు చేయనున్నారు. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు రూ. 5లక్షల రూపాయలను మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తుంది. పేదలకు అందించే ఈ సాయాన్ని మహిళల పేరుమీదనే మంజూరు చేయనున్నారు. స్తా ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్ లు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల కానుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
