- Advertisement -

ఉత్తరాంధ్రను ముంచెత్తిన వర్షాలు

- Advertisement -

ఉత్తరాంధ్రను వర్షాలు ముంచెత్తాయి. ఇవాళ పిడుగులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే అల్లూరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా భారీ వర్షాలు, వరదలో శ్రీకాకుళంలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

భారీ వర్షాల వల్ల వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగింది. అటు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నదికి వరద ఉధృతితో పోటెత్తుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తిరుచానూర్, రేణిగుంట, చంద్రగిరి వైపు వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. వరదనీటితో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -