తెలంగాణలో కేసీఆర్ శకం ఇక ముగిసినట్లేనన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ …స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అన్నారు.
సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీలందరూ అలెర్ట్ గా ఉండాలి… నేను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయా కానీ టీపీసీసీ అధ్యక్షడిగా అవకాశం లభించింది అన్నారు. ఏఐసీసీ పరిశీలికుల చేత డీసీసీల నియామకం జరిగింది అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అందరూ అణగారిన వర్గాల కోసం కష్టపడుతున్నారు … రెండేళ్ల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయి..తప్పకుండా పనికి తగ్గ గుర్తింపు దక్కుతుంది అన్నారు.
గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసింది అన్నారు సీఎం రేవంత్. నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, ఆస్తులు ధారపోశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ. స్వతంత్రం రావడంలో నేషనల్ హెరాల్డ్ పత్రికది ప్రముఖపాత్ర అన్నారు.
