ప్రజాస్వామికంగా గెలిచిన కార్పొరేటర్లే స్వయంగా మేయర్లను ఎంపిక చేసుకుంటారు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండి..ఇందులో రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు అన్నారు. గెలిచామని, జెండా పాతామని మీరు చెప్పుకున్నప్పటికీ మేమేమైనా అన్నామా?…మేం ఎవరికీ వ్యతిరేకం కాదు … నిజామాబాద్ మాదిరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ కి మెజారిటీ లేదు అన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 సీట్లు ఉన్నాయి.. 28 సీట్లతో బీజేపీ ఉంది.. అక్కడ పార్లిమెంట్ సభ్యుడు మెజారిటీ లేదని ప్రతిపక్షం లో కూర్చుంటామని అన్నారు.. కాంగ్రెస్ మిగతా పార్టీలు అన్ని గెలిచాయి..అక్కడ ఏమవుతుందని భవిషత్ నిర్ణయిస్తుంది..కరీంనగర్ లో మేమే గెలిచామని ప్రకటించిన బండి సంజయ్ కి 66+ఎంపీ+ లోకల్ ఎమ్మెల్యే + మానుకొండూరు ఎమ్మెల్యే ..అంటే మొత్తం 69 సభ్యులకు బీజేపీ కి 30 ఉన్నాయి అన్నారు.
మేయర్ అవుతామని ప్రకటించుకుంది బండి సంజయ్ … రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎలా ప్రకటించుకున్నారో ..వాళ్ళ లాగే మిగతా పార్టీలకు వ్యూహాలు ఉంటాయి..రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా బీజేపీ వారి పొత్తుల పార్టీలను ఎలా కులగొట్టింది..అవినీతిపరులను వాళ్ల పార్టీలో ఎలా చేర్పించుకొని పునీతులయ్యారు ఇది సందర్భం కాదు..రాజకీయ పార్టీ గా గతంలో మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా కరీంనగర్ లో మేయర్ అయ్యాం..ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచనల మేరకు వ్యవహరిస్తాం..ముఖ్యమంత్రి మంత్రుల జోక్యం లేదు.. స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులు వారి ఆలోచనకనుగుణంగా వ్యవహరిస్తాం..నిజామాబాద్ లో మెజారిటీ లేదు.. ఇక్కడ 69 కి 30 వచ్చాయి..నిజామాబాద్ లో లాగా ఇక్కడ కూడా ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పాల్సి ఉండే..డెమోక్రటిక్ గానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ను ఎన్నుకుంటారు.. కానీ ముఖ్యమంత్రి ,మంత్రులు ,ప్రజా ప్రతినిధులను తిరగనీయం అనేది సరైనది కాదు .ఇది డెమోక్రసీ అన్నారు.
ప్రజాస్వామ్యం లో మేము ఎవరికి వ్యతిరేకం కాదు..బీజేపీ లో గెలిచిన 30 మందికి శుభాకాంక్షలు.. మిగిలిన 36 మందికి శుభాకాంక్షలు..అందరూ కలిసి మేయర్ ను ఎన్నుకోండి కరీంనగర్ లాంటి మూడు లక్షల మంది ఓటర్లున్న పట్టణాన్ని తెలంగాణ లోనే అత్యధిక డివిజన్లున్న కార్పొరేషన్..ఉత్తర తెలంగాణ లో కరీంనగర్ ను అభివృద్ధి చేయాలని మా ఆలోచన.. దానికి అనుగుణంగా మంచి పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆలోచన..మీకు మెజారిటీ ఉంటే మేము అడ్డుపడడం లేదు… మేము ఎవరికీ వ్యతిరేకం కాదు ఎవరిని పదవి నుంచి దింపే ప్రయత్నం చేయడం లేదు అన్నారు.
