- Advertisement -

అంబేద్కర్ జయంతి..టీడీపీ నేతకు నిర‌స‌న సెగ‌

- Advertisement -

అంబేద్కర్ జయంతి వేడుకల వేళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావుకు చేదు అనుభవం ఎదురైంది. దళితులపై ఆయన గతంలో చేసినట్లుగా చెబుతున్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఆయన పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని క్వారీ సెంటర్ వద్ద ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ఆదిరెడ్డి అప్పారావు తన అనుచరులతో కలిసి వచ్చారు. అయితే, ఆయన రాకను గమనించిన దళిత నేతలు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు అక్కడికి భారీగా చేరుకుని అప్పారావును అడ్డుకున్నారు.

దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు” అంటూ దళిత సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఆదిరెడ్డి అప్పారావుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. టీడీపీ నేతను విగ్రహం వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో క్వారీ సెంటర్ వద్ద తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దళిత సంఘాల నిరసన సెగ తీవ్రంగా ఉండటం, పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయినప్పటికీ నిరసనకారులు శాంతించకపోవడంతో, చేసేదేమీ లేక ఆదిరెడ్డి అప్పారావు తన పర్యటనను రద్దు చేసుకుని కాన్వాయ్‌లో అక్కడి నుండి వెనుతిరిగారు. ఈ ఘటన స్థానికంగా మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

“అంబేద్కర్ అందరివాడు, కానీ ఆయన ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారు రాజకీయ లబ్ధి కోసం విగ్రహాలకు పూలమాలలు వేయడం ఆపాలి” అని ఆందోళనకారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -