ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం ఉంది.. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడింది అన్నారు. బీజేపీ కోసం ఓట్లను ఈసీ దొంగిలించింది.. ఎగ్జిట్‌పోల్స్‌కు, ఫలితాలకు చాలా తేడా ఉంది అన్నారు.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. పోలింగ్‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాయం చేశారు.. సా.5 గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదైంది అన్నారు. బీజేపీ చెప్పినట్టు ఈసీ అధికారులు చేస్తున్నారు.. మహారాష్ట్రలో 40 లక్షల రహస్య ఓటర్లను చేర్పించారు.. ఎలక్ట్రానిక్ డేటాను ఈసీ మాకు ఇవ్వడం లేదు అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము చిత్తుగా ఓడిపోయాం కానీ లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం….ఈ రెండు ఎన్నికల మధ్య కోటి కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు అన్నారు. దీనిపై ఈసీకి లేఖ రాస్తే మాకు ఓటర్ లిస్ట్ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించింది అన్నారు.
ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి… ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాం అన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి… బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారు, బీహార్లో ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
