- Advertisement -

బెదిరించి..కాగితాలపై సంతకాలు తీసుకున్నారు!

- Advertisement -

సింగయ్య మృతిపై నారా లోకేష్ మీద సంచలన ఆరోపణలు చేశారు ఆయన భార్య లూర్దు మేరి. సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు అని…తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు.. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు అన్నారు.

కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు.. సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు అని తెలిపారు. పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారు.. మా మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు అన్నారు. నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి.. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగింది అన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు..చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు.. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది అని చెప్పారు. కొందరు వైసీపీ వాళ్లు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్దాం అంటే వద్దని అంబులెన్స్ లోనే తీసుకెళ్లారు అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -