- Advertisement -

తిరుమల వేదికగా బాబు నీచరాజకీయాలు!

- Advertisement -

తిరుమల వేదికగా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మా ప్రభుత్వం వచ్చాక తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గించాం అన్నారు. స్వామివారి నిధులను చంద్రబాబు ప్రైవేటు బ్యాంకులో పెడితే మా ప్రభుత్వం రాగానే వెంటనే ఆ నిధులను తెచ్చి ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేశాం అన్నారు.

కొద్దిరోజులకే ఆ ప్రైవేటు బ్యాంకు దివాలా తీసింది. ఏ ప్రయోజనాలకోసం చంద్రబాబు ఈ పనిచేశాడో సమాధానం చెప్పాలి. అయినా సరే ఈ అంశాన్ని మేము రాజకీయాలకు వాడుకోలేదు. L1 దర్శనాలు రద్దు చేశాం, శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసాం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాం, గుడికో గోమాత కార్యక్రమం అమలు చేశాం అన్నారు.

కల్తీ నెయ్యి కావడం వల్లే తక్కువ ధరకు వచ్చిందని మరో దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. మరి చంద్రబాబు హయాంలోనూ నెయ్యి ఖరీదు ఎక్కువగా ఏమీ లేదే? అంటే అది కూడా కల్తీ నెయ్యేనా? సిట్ విచారణ 2019-24 కాలానికే ఎందుకు పరిమితం చేస్తున్నారు? అంతకు ముందు చంద్రబాబు హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై కూడా విచారణ చేయాలని మేం సిట్ ను డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం తిరుపతి లడ్డూ ప్రసాదంపై గత కొన్నాళ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో అంటే, యానిమల్ ఫ్యాట్ అని చంద్రబాబు అన్నారు. రెండిట్లో ఏది నిజం అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి ట్యాంకర్లు లడ్డూ తయారీలో అసలు ఉపయోగించారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. దీనిపై సిట్ విచారణ జరుగుతూ ఉండగానే లీకుల పేరుతో మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -