కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే కేవలం లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేశారు. ఈ క్రమంలో మొదట ఏప్రిల్ 14 వరకే అని ప్రకటించిన ప్రభుత్వం.. తర్వాత మే 3 వరకూ దానిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే.. లాక్ డౌన్ కారణంగా డైలీ ఇన్కం పై ఆధారపడిన వారు.. నిత్య అవసరాలకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఇలాంటి సమయంలో సినీ సెలబ్రిటీలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ కాల్ సెంటర్ లో పనిచేస్తుందట. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన మేడ మీద అబ్బాయి అలాగే గాయత్రి వంటి సినిమాల్లో నటించిన నిఖిల విమల్. కేరళ ప్రభుత్వం వారు కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కోవిడ్-19 కాల్ సెంటర్ ఏర్పాటు చేసారు. ఆ కాల్ సెంటర్ లో పని చేస్తోంది హీరోయిన్ నిఖిల విమల్. ఆపదలో ఉన్నవారికి ఈ విధంగా సాయం చేస్తోందట.
ప్రజలకు కావాల్సిన అవసరాలు ఈ సేవా కేంద్రానికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన వాలంటీర్ల ద్వారా… ఈమె ప్రజలకు సాయం చేస్తుందట. ఈ మేరకు ఆమె రోజు 20 కిలో మీటర్లు ప్రయాణం చేస్తుందని తెలుస్తోంది. ఏమైనా ఈ హీరోయిన్ కి గొప్ప మనసు ఉందని అందరు ప్రశంసిస్తున్నారు.
