హైదరాబాద్‌లో సినీ ప్రముఖులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో నిర్మాత దిల్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, వారికి సంబంధంచిన వారిపై దాడులు చేశారు ఐటీ అధికారులు.
దిల్ రాజు, దిల్ రాజు సోదరుడు శిరీష్, దిల్ రాజు కూతురు హన్షిత ఇళ్లతో పాటు దిల్ రాజు రెండు ఆఫీసుల్లో, మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్, మైత్రి సీఈఓ చెర్రీ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మొత్తం 8 చోట్ల 55 మంది అధికారులు ఐటీ రైడ్ చేయగా మరికొంతమంది నిర్మాతలపై కూడా ఐటీ రైడ్స్ జరగనున్నట్లు సమాచారం.
దిల్ రాజు ఇంట్లో 7 గంటల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారు. సినిమా రిలేటెడ్ ఇష్యూలో భాగంగానే సోదాలు జరిగాయని దిల్ రాజు భార్య తేజస్విని తెలిపారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ ఖాతా వివరాలు అడిగారు.. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామన్నారు. దిల్ రాజు సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో రాగా భారీ లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మైత్రి నిర్మాతలకు పుష్ప 2 సినిమాకు భారీగా లాభాలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే అభిషేక్ అగర్వాల్, దర్శకుడు అనిల్ రావిపూడి, సింగర్ సునీత భర్త రామ్ మ్యాంగో సంస్థపై, సుకుమార్, నిర్మాతలకు సపోర్ట్ ఇచ్చే రిలయన్స్ శ్రీధర్, సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చే సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీలపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒకేసారి సినీ ప్రముఖులపై దాడుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
