ఆ సీక్వెల్ కు ఒకే చెప్పిన చిట్టి.. ఏ సినిమా అంటే?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా “ఢీ అండ్‌ ఢీ”ఈ మూవీనీ 24 ఫ్యాక్టరీ ఫిలింస్‌ పతాకంపై హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా 2007లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ” ఢీ ” సినిమాకు సీక్వెల్‌ గా శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఢీ మూవీలో ఉన్న కామెడీ, యాక్షన్‌ ఈ సీక్వెల్‌లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో ‘డబుల్‌ డోస్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు.

ఇటీవలే శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘ఢీ’ కథ, ఈ సీక్వెల్‌ కథ రెండూ డిఫరెంట్ గా ఉంటాయని, అయితే “ఢీ” సినిమాలో ఉండే కొన్ని క్యారెక్టర్లను మాత్రం సీక్వెల్‌లో ఉండబోతున్నాయని ఓ సందర్భంలో తెలియజేశాడు.గత సినిమాల్లోని తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా “ఢీ అండ్‌ ఢీ” మూవీని సిద్ధం చేస్తున్నారట శీను వైట్ల.

- Advertisement -

Also read:లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్న సుమ.. ఎలా అంటే?

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతి రత్నాలు మూవీతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లాను “ఢీ అండ్‌ ఢీ” సీక్వెల్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -