Thursday, March 28, 2024
- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు : మంచు లక్ష్మి

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియాం ఉంటే.. అది ప్రైవేటుకు నష్టం. అది అందరికి తెలిసిందే. కానీ ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు మీడియం చదివి పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలుగుతున్నారా ? అనేది అందరికి కలిగే సందేహమే. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను నేర్పించేస్తే బాగుంటుందని అందరి ఆలోచన.

అయితే తాజాగా లాక్ అప్ విత్ మంచు లక్ష్మిషోలో శ్రీవిద్యానికేతన్ (తిరుపతి) పాఠశాలల్ని నిర్వహిస్తున్న మంచు వారసురాలు మంచు లక్ష్మీ ప్రసన్న చెప్పిన మాటల్ని పరిశీలిస్తేప్రయివేటు కార్పొరెట్ సైకాలజీ` అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమానికి నేను పూర్తిగా వ్యతిరేకం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా పరిచయం చేయాలనే ఆలోచన నాకు నచ్చదు. చాలా మంది ఉపాధ్యాయులకు ప్రాథమిక విషయాలు కూడా తెలియవు. విద్యావేత్తగా నేను ఇంగ్లీషు నేర్పిస్తే చాలు అన్నది నా అభిప్రాయం అని తెలిపారు. అంతేకాదు.. ప్రైవేట్ పాఠశాలలు మహమ్మారీ క్లిష్ఠ సమయంలో కనీసం ఆన్లైన్ తరగతులను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపైనే నా ఆందోళన అంటూ కామెంట్స్ చేశారు. అయితే మంచు లక్ష్మీ తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో కానీ.. ప్రభుత్వ పాఠశాలల టీచర్లుకు ఏం రాదు అన్నట్లు మాట్లాడారు.

వారికి ఇంగ్లీష్ తెలియదని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వ టీచర్ అంటే మరీ అంత చులకనా ? ఎన్నో కాంపిటీటివ్ పరీక్షలు రాసి పోరాడి చివరికి ఉద్యోగం సంపాదించే టీచర్లను తక్కువ చేసి ఎలాంటి అర్హతా లేని ప్రయివేటు టీచర్లు గొప్ప అన్నట్టుగానే మాట్లాడారు. ఇక ఆన్ లైన్ పాఠాలు నేర్పే సత్తా ప్రభుత్వ పాఠశాలలకు లేదని తేల్చేశారు. మొత్తానికి మంచు లక్ష్మి మనసులో మాట బయటపడింది. ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లీష్ విద్యను నేర్పిస్తే ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి ఏంటి ? అన్న ఆందోళన బయటపడింది.

మంచు లక్ష్మి పోవే అన్న నేటిజన్.. ఏం జరిగింది ?

పెళ్లి రోజు భయపడి పారిపోవాలనుకున్నా : మంచు లక్ష్మీ

నా భార్యాపిల్లలు అమెరికాలో ఉన్నారు : భావోద్వేగానికి గురైన మంచు విష్ణు

నితిన్, కళ్యాణ్ రామ్‌ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -