Friday, May 3, 2024
- Advertisement -

రాజమౌళి బాహుబలి- 2 లో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే..?

- Advertisement -

బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇటివలే ఈ సినిమా బుల్లితెరపై కూడా ప్రసారం అయింది. బాహుబలి 2 లో చిన్న చిన్న లోపాలు కొన్ని ఉన్నా, రాజమౌళి మ్యాజిక్ ముందు అవి తేలిపోయాయి. అయితే కట్టప్ప పాత్ర విషయంలో రాజమౌళి పెద్ద తప్పు చేసారని అనిపించింది.

కట్టప్ప బాహుబలిని చంపాక, శివగామి దగ్గరకి వచ్చి భల్లాలదేవ కుట్ర గురించి చెబుతారు. తన తప్పు తెలుసుకున్న శివగామి వెంటనే దర్బార్ ఏర్పాటు చేసి దోషులకి శిక్షవేద్దాం అని కట్టప్ప తో చెబుతుంది అప్పుడు భల్లాలదేవ తన తల్లి ని కూడా బంధించబోతాడు. కట్టప్ప భల్లాలదేవ ను పక్కకి తోసేసి శివగామిని తప్పిస్తాడు. అంటే రాజు అయిన భల్లాలదేవ ని ధిక్కరించినట్లే. అలాంటి కట్టప్ప ని భల్లాలదేవ ఏమీ చేయకుండా వదిలేస్తాడు, తన కొలువులోనే కొనసాగనిస్తాడు.

పసిగుడ్డుని కూడా చంపుదాం అని ఆలోచించిన భల్లాలదేవ కట్టప్పని మాత్రం చంపకుండా ఎందుకు వదిలేశాడు? దేవసేనకి చెందిన కుంతల రాజ్యాన్ని కూడా నాశనం చేసిన భల్లాలదేవ కట్టప్ప ని మాత్రం వదిలేయడం ఎందుకో? మరోపక్క బాల మహేంద్ర బాహుబలే మాహిష్మతికి రాజు అని శివగామి ప్రకటించాక, బాల మహేంద్ర బాహుబలి పాదాల్ని తన నెత్తిన పెట్టుకున్న కట్టప్ప, భల్లాలదేవ దగ్గర ఎందుకు పనిచేసాడు? సినిమా లో ఎమోషన్స్ అండ్ గ్రాఫిక్స్ భారీగా ఉండడం, హైప్ రావడం వల్ల సరిపోయింది కానీ బాహుబలి లో ఇలాంటి పొరపాట్లు చాలానే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -