సమంతతో ఎఫైర్ పై స్పందించిన ప్రీతం..

- Advertisement -

ప్రస్తుతం నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం టాలీవుడ్ లోనే కాదు.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో సమంతపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే నాగచైతన్య, సమంత విడాకులకు కారణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే.

ప్రీతమ్ జుకాల్కర్ దీని పై ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించాడు. సమంతను నేను అక్కా అని పిలుస్తానని, చాలా మందికి ఈ విష‌యం తెలుసని చెప్పాడు. ఇక మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా తనను చంపేస్తామని బెదిరిస్తున్నార‌ని, చాల మంది తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారని, అంతే కాదు కెరీర్‌ను నాశనం చేస్తామంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

తనకు సమంతకు మధ్య ఉన్న అనుబంధం గురించి నాగ‌ చైతన్యకు బాగా తెలుస‌ని… ఇంత ప్రచారం జరుగుతున్నా నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోందని ప్రీతమ్ అన్నాడు… అంతేకాదు నాగ‌చైత‌న్య ఓ ప్ర‌క‌ట‌న చేస్తే ఈ పరిస్థితిలో చాలా మార్పు వస్తుందని ప్రీతమ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

‘భీమ్లా నాయక్’ లో భారీ ఛేజింగ్ సీన్…

మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ గా సమంత..

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -