సెలబ్రిటీలకు 20రూపాయలిచ్చి టీ తాగమన్న వాచ్ మెన్!

Security guard gives Rs 20 to Chinmayi and Rahul for tea

పెద్ద నోట్ల రద్దు చేయడంతో.. సామాన్య ప్రజలే కాదు.. సెలబ్రిటీలు చాలా కష్టాలు పడుతున్నారు. మోడీ ఉన్నట్లుండీ ఈ నిర్ణయం ప్రకటించడంతో విదేశాల్లో ఉన్న వాళ్లు, విమానాల్లో వస్తున్న వాళ్లు నరకయాతన పడ్డారు. ఈ పరిస్థితి సెలబ్రిటీలకు కూడా మినహాయింపు కాదని చెప్పే ఘటన ఇప్పుడు తెలుసుకుందాం.

సౌతిండియా సమంత గొంతుక చిన్మయి, అప్ కమింగ్ హీరో రాహుల్ రవీంద్రన్ లు సెలబ్రిటీలే కాదు రియల్ లైఫ్ కపుల్ కూడా. ఈ జంట నోట్ల రద్దు నిర్ణయం సమయంలో విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లైట్ దిగగానే నోట్ల రద్దు గురించి విని కంగారుపడిపోయారట.

ఎయిర్ పోర్ట్ లో ఏటీఎంకు పరుగెత్తినా.. నోట్లు లేవన్నాడట వాచ్ మెన్. అయితే వీరి కష్టాలు గుర్తించి, సెలబ్రిటీల కదా పోన్లే పాపం అని 20రూపాయలిచ్చి టీ తాగమన్నాడట. అందరికీ టిప్పులివ్వడం అలవాటైన సెలబ్రిటీ కపుల్.. ఒక్కసారిగా షాకయ్యారట. డబ్బుకు లోకం దాసోహం అంటే ఏంటో అనుకున్నామని, పెద్ద నోట్ల రద్దుతో డబ్బుండీ వాచ్ మన్ ఇచ్చిన డబ్బుతో టీ తాగాల్సి వచ్చిందని చెబుతున్నారు చిన్మయి, రాహుల్. అయితే తమ పరిస్థితికి జాలిపడ్డ వాచ్ మెన్ కు ట్విట్టర్లో థాంక్స్ చెప్పారీ కపుల్.

Related

  1. పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ్ తరుణ్
  2. రామ్ చరణ్, ఉపాస‌న మ‌ధ్య ఆ హీరోయిన్!
  3. పవన్ ఇక సినిమాలు చేయడా?
  4. రోజా గ్లామ‌ర్ వెనక ఉన్న సీక్రెట్ అదేనా?