భర్తను తలుచుకుంటూ బోరున ఏడ్చిన సురేఖావాణి.. ఎందుకంటే?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల ఎంతో పేరు సంపాదించుకున్న నటి సురేఖ వాణి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.వెండితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

పైకి ఎంతో నవ్వుతూ ఆనందంగా కనిపించే సురేఖవాణి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినదని, తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన ఆమె తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సురేష్ తేజ అనే మీడియా పర్సన్‌ని ప్రేమించి పెళ్లాడిన సురేఖ వాణి అతనితో తన జీవితం ఎంతో హాయిగా సాగిపోతున్న నేపథ్యంలో తన పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. అప్పట్లో ఆ వార్తలపై స్పందించి వాటిని ఖండించారు.

- Advertisement -

Also read:మందుబాబుల్లో అది చూస్తే ఉందంటున్న యాంకర్ రవి!

ఎంతో హాయిగా సాగిపోతున్న వీరి జీవితంలో రెండేళ్ల క్రితం తన భర్త అనారోగ్యంతో మృతి చెందడం వల్ల తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.అయితే ఇప్పుడు కూడా తనపై పెద్దఎత్తున రూమర్లు వస్తున్నాయని తను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ రెండో వాడు ఎవరో మీరే చెప్పండి అంటూ తనదైన శైలిలో ఆమె స్పందించారు.అదేవిధంగా తన భర్త మరణం తర్వాత తన అత్తింటివారు కూడా తనకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయలేదని తన భర్తను గుర్తుచేసుకుని సురేఖవాణి బోరున విలపించారు.మే 10న ప్రసారం కాబోయే ఈ కార్యక్రమాన్ని సంబంధించిన ప్రోమో విడుదల చేయగా సురేఖవాణి తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

Also read:రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -