ప్ర‌భాస్ సాహోకి అడ్డుపడుతున్న బ‌డా నిర్మాత‌లు..!

- Advertisement -

బాహుబ‌లి త‌రువాత నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. బాహుబ‌లి తరువాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అంద‌రు అతృత‌గా ఎదురు చూస్తున్నారు. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది సాహో మూవీ. ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. సినిమాను వ‌చ్చే వేస‌విలో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాత‌లు.

అయితే సాహో సినిమా విడుద‌ల‌కు టాలీవుడ్ బ‌డా నిర్మాత‌లు దిల్ రాజు, అల్లు అర‌వింద్ అడ్డుప‌డుతున్నార‌ట‌. దిల్ రాజు,అల్లు అర‌వింద్ ఇద్ద‌రికి సొంతంగా థియోట‌ర్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా థియోట‌ర్లు చాల‌వ‌ర‌కు షాపింగ్ మాల్స్ మారిపోయ్యాయి. ఇక మీద థియోట‌ర్ల చాలా వరకు ఆధీనంలోకి ఉంచుకోవడం బెటర్ అని దిల్ రాజు అల్లు అరవింద్ వంటి వారితో పోటీకి సిద్ధమయ్యారు. ఎందుకంటే సినిమాల లాభాల‌తో పాటు షాపింగ్ మాల్స్‌లో కూడా లాభాలు పొంద‌వ‌చ్చ‌ని ఈ నిర్మాతల ఆలోచ‌న. దీనిలో భాగంగానే వ‌చ్చే వేస‌వి నాటికి థియోట‌ర్లు అన్నింటిని త‌మ అధీనంలో ఉంచుకుని సినిమాల‌ను విడుద‌ల చేయ‌ల‌ని భావిస్తున్నారు. మ‌రి వ‌చ్చే వేస‌వికి వ‌ద్ద‌మ‌నుకున్న సాహో మూవీకి అనుకున్నన్ని థియోట‌ర్లు దొర‌క‌వు అని చిత్ర నిర్మాత‌లు బాధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తుంది. మరి ఈ బిజినెస్‌లో దిల్ రాజు, అల్లు అర‌వింద్‌లు ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -