- Advertisement -

మళ్లీ తెరపైకి విజయ్‌-రష్మిక పెళ్లి?

- Advertisement -

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతోంది. గత ఏడాది వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారని వార్తలు వచ్చినప్పటికీ, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల ఫిబ్రవరి 2న వీరి వివాహం జరగబోతుందంటూ ప్రచారం జరిగినా, అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి.

అయితే తాజాగా మరో ఆసక్తికరమైన సమాచారం బయటికి వచ్చింది. రాజపుతుల కాలం నాటి అద్భుతమైన మహల్‌లు, అందమైన సరస్సులతో ప్రసిద్ధి చెందిన ఉదయపూర్‌లో ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. అయినప్పటికీ, ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరు కూడా మౌనం వీడలేదు. ఈ వార్తను వారు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

ఇక వృత్తిపరమైన విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో మరోసారి కలిసి వెండితెరపై కనిపించనున్నారు. ‘రణబాలి’ అనే పీరియడ్ చిత్రంలో వీరిద్దరూ నటిస్తున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన ఓ భయంకరమైన జననాశనాన్ని నేపథ్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -