Friday, April 26, 2024
- Advertisement -

ఎంపీలు సిగ్గుపడాలి: పార్లమెంటు క్యాంటీన్ లో ధరలు యమ చీప్!

- Advertisement -

ఒక కప్పు  టీ – రూపాయి.

రైస్ ఖీర్ – ఐదున్నర రూపాయలు

మసాలా దోసె- ఆరు రూపాయలు

మటన్ బిర్యానీ -27 రూపాయలు

ఫిష్ కర్రీ – 13 రూపాయలు

వెజిటేరియన్ మీల్ -12.30 పైసలు

నాన్ వెజిటేరియన్ మీల్ – 22 రూపాయలు… ఇవీ భారత పార్లమెంటు లోని క్యాంటీన్ లో ఆహార పదార్థాల ధరలు. మన దేశంలో ఎక్కడా దొరకనంత చీప్ గా దొరుకుతున్నాయక్కడ. ఇవే ఆహార పదార్థాలను జనసామాన్యం భారీ ధరలు వెచ్చించి తింటుంటే… ఎంపీలకు మాత్రం అన్నీ కారు చవకగా అందుతున్నాయి.

మరి దీని వల్ల ప్రభుత్వంపై పడుతున్న భారం ప్రతి ఏడాదికీ 12 కోట్ల రూపాయలు. ఐదు సంవత్సరాల్లో దాదాపు 60 కోట్ల రూపాయలు ఈ క్యాంటీన్ సబ్సిడీల కోసమే వెచ్చించడం జరిగిందని తెలుస్తోంది. మరి ఎంపీలు అంటే ఆర్థికంగా ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారే అనుకోవచ్చు. వాళ్లకు అనేక రకాల అలవెన్సులు కూడా ఉన్నాయి.

మరి ఇలాంటి వారికి ఇంతంత సబ్సిడీతో ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. అసలు రేటు పెట్టి కొనుక్కొని తినగ సామర్థ్యం ఉన్నవారికి ఇంత రాయితీ ఇచ్చి ఆహారం పెట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. ఇలాంటి రాయితీలు వ్యవస్థపై సామాన్యుడిలో అసంతృప్తిని కలిగించేవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -